Skip to Content

Horrific Road Accident Near Kodad; Six Dead

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
26 August 2026 by
thenewsagency


సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్ నుంచి 40మంది ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు ఉన్న కంటైనర్  లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా  మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సాయంతో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Share this post
Tags 


Archive